కిన్నెర మొగుల‌య్య ను సన్మానించిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్

ప్రముఖ గాయకుడు కిన్నెర మొగులయ్యను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సన్మానించాడు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని… పాట పాడినందుకు గానూ… కిన్నెర మొగులయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సన్మానించాడు. ఆర్టీసీని కిన్నెర మొగులయ్య ప్రమోట్‌ చేస్తూ.. పాట పాడటం చాలా మంచి విషయమని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

అయితే.. గత రెండు రోజుల కింద కిన్నెర మొగులయ్య ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితంటూ పాట పాడాడు. ఆ పాట రెండు రోజుల పాటు సోషల్‌ మీడియా లో వైరల్‌ అయింది. అంతేకాదు.. ఈ పాటకు మంచి వ్యూస్‌, లైక్స్‌ కూడా వచ్చాయి. ఈ తరుణంలోనే.. కిన్నెర మొగులయ్యను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సన్మానించాడు. అలాగే… రాష్ట్ర వ్యాప్తంగా మొగులయ్యకు బస్సులలో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించారు.

Related Articles

Latest Articles