విషాదం : వరదల్లో ఆర్టీసీ బస్సులు.. 4గురు మృతి..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి రోడ్లపై వరద నీరు వచ్చిచేరుతోంది. అయితే కడప జిల్లా రాజంపేటలోని చెయ్యేరు నది కట్ట తేగిపోవడంతో ఒక్కసారి రోడ్లపై వరద నీరు వచ్చింది.

దీంతో రోడ్డుపై ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు ముందుకు కదలలేక వరద నీటిలోనే నిలిచిపోయాయి. వరద నీరు బస్సులోకి చేరడంతో ప్రయానికులు బస్సు పైకి ఎక్కి కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటికీ వరద నీటిలో చిక్కుకొని కండ్టక్టర్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. వరద నీటిలో చిక్కుకున్న బస్సులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Related Articles

Latest Articles