ఉధృతంగా మానేరు వాగు.. కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు..

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ సైతం జారీ చేసింది.. ఇక, భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఇక, నిన్న మానేరు వాగుపై ఉన్న లెవెల్ వంతెనపై ఆర్టీసీ బస్సు చిక్కుకు పోగా.. ఇవాళ ఉదయం ప్రవాహ ఉధృతి ఎక్కువవడంతో వంతెనపై చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. వాగులో కొట్టుకుపోయింది.. వాగు పొంగి పొర్లుతుండడంతో బస్సును బయటకు తీసేందుకు అధికారులు, సిబ్బంది సాహసించలేదు.. దీంతో.. క్రమంగా పెరుగుతున్న వాగు వరద ఉధృతిలో నీట మునుగుతూ.. ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది.. కాగా, కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు మానేరు వాగుపై ఉన్న వంతెనపై సోమవారం రోజు చిక్కుకోగా.. అందులో ఉన్న దాదాపు 30 మంది ప్రయాణికులను.. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.. బస్సును కూడా జేసీబీ సహాయంతో బయటకు తీసే ప్రయత్నాలు చేసినా.. విఫలం అయ్యారు.

Related Articles

Latest Articles

-Advertisement-