ఊర్లకు వెళ్లే వారి కోసం బస్సు పాయింట్లను ప్రకటించిన టీఎస్‌ ఆర్టీసీ

సంక్రాంతి సంబరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది సొంత ఊర్లకు వివిధ మార్గాల ద్వారా చేరుకున్నారు. ఇంకా చేరుకుని వారికోసం టీఎస్‌ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా టీఎస్‌ ఆర్టీసీ వారి గమ్య స్థానాలను చేర్చేందకు బస్సు పాయింట్లను ప్రకటించింది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే బస్సులు సెంట్రల్ బస్ స్టేషన్ (సీబీఎస్‌) నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే బస్సులు దిల్‌షుఖ్‌నగర్‌ నుంచి బయలు దేరుతాయి.

Read Also: భద్రాద్రికి రావొద్దు: కలెక్టర్ కీలక ఆదేశాలు

మహబూబ్ నగర్, నారాయణపేట్, ఖమ్మం, నాగర్ కర్నూల్, రాయచూరు బస్‌లు MGBS బస్టాండ్‌ నుంచి వెళ్తాయి. కాగా తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సు పాయింట్ల వివరాలు.. కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, గోదావరి ఖనికి వెళ్లే బస్సులు జేబీఎస్‌ బస్టాండ్‌ నుంచి నడుస్తాయి. వరంగల్, హన్మకొండ, మమబూబాబాద్ బస్సులు ఉప్పల్‌ నుంచి ప్రారంభమవుతాయి. ఆర్టీసీ బస్సు పాయింట్లను ప్రకటించడంతో రద్దీ తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఓ వైపు కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం అన్ని ఏర్పాట్లను చేశామని అధికారులు పేర్కొన్నారు.

Related Articles

Latest Articles