చిచ్చు రేపుతున్న ఆరెస్సెస్‌-తాలిబాన్‌ పోలిక!

సున్నిత అంశాలపై ఏమాత్రం నోరు జారినా రచ్చే. పెద్ద వివాదంగా మారుతుంది. హిందీ ఫిలిం రైటర్‌ జావేద్‌ అక్తర్‌ మాటలు మంటలు రేపుతున్నాయి. ఆరెస్సెస్‌ని ఆయన తాలిబాన్లతో పోల్చటం తీవ్ర వివాదాస్సదమైంది. తాలిబాన్ల అనాగ‌రిక చ‌ర్యలను ఖండించాల‌ని,ఇప్పుడు కొందరు ఆ పనే చేస్తున్నారని జావెద్‌ అక్తర్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అదే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారింది. ముంబై లో నిరసన జ్వాలలుఎగిసిపడుతున్నాయి. తక్షణం క్షమాపణ చెప్పాలని…లేదంటే దేశ వ్యాప్తంగా ఆయన సినిమాల రిలీజ్‌ని అడ్డుకుంటామని ఘాట్‌కోపర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే .. బీజేపీ అధికార ప్రతినిధి రామ్‌ కదాం స్ట్రాంగ్‌ వార్నింగిచ్చారు. జావేద్‌ అక్తర్‌ రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జావెద్‌ అక్తర్‌ కామెంట్స్‌పై దేశ వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఫైర్‌ అవుతున్నారు. ఆయనపై పోలీస్‌ స్టేషన్లలో కేసులు కూడా నమోదవుతున్నాయి. తాలిబన్లు ఎలా ఇస్లామిక్‌ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి వారు కూడా హిందూ రాష్ట్ర కోసం పని చేస్తున్నారని జావేద్‌ అక్తర్‌ శనివారం ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టారు.

జావెద్‌ అక్తర్‌ మాటలను శివసేన కూడా తప్పు పట్టింది. తాలిబాన్లతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను పోల్చటం నూటికి నూరుపాళ్లు తప్పేనని ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. హిందూ దేశాన్ని కోరుకుంటున్నవారు తాలిబన్ల మైండ్‌ సెట్‌ కలవారిని మీరెలా చెపుతారని ప్రశ్నించింది. జావెద్‌ తరచూ రైట్‌ వింగ్‌ రాజకీయాలను విమర్శిస్తుంటారు. ప్రపంచంలోని రైటిస్టులంతా దాదాపు ఒకటేనని ఇటీవల ఓ న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జావెద్‌ అక్తర్‌ లౌకిక వాది, ఛాందసవాదులకు వ్యతిరేకంగా గళమెత్తుతారు కానీ తాలిబాన్లతో ఆరెస్సెస్‌ని పోల్చటం పూర్తిగా తప్పు అంది సామ్నా పత్రిక.

వాస్తవానికి ఆఫ్గనిస్తాన్‌ ఆక్రమణ తరువాత భారత్‌లో కూడా వారి పేరు మార్మోగుతోంది. రాజకీయాలకు కూడా తాలిబన్లను ముడిపెడుతున్నారు. పెట్రోల్‌ ధరల పెరుగుదలకు తాలిబన్లే కారణమని ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. మరో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా వ్యాఖ్యలు తాలిబాన్లపై చేసిన కామెంట్స్‌ కూడా దుమారం రేపాయి.

తాలిబన్ల గెలుపుకు సంబరపడుతున్న కొంత మంది భారత ముస్లింలపై ఆయన షా మండిపడ్డారు. ‘ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడం ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురి చేస్తుండగా.. భారత ముస్లింల్లోని కొన్ని వర్గాల అనాగరికులు సంబరాలు చేసుకోవడం ప్రమాదకరం’ అని ఓ వీడియోలో పేర్కొన్నారు. ఇదో ప్రమాదకరమైన దోరణి..వారు తమను తాము ప్రశ్నించుకోవాలని అన్నారు. అలాంటి వారు సంస్కరించబడాలనుకుంటే ఆధునిక ఇస్లాం లేదా పురాతన నాగరికతతో బతకాలన్నారు నజీరుద్దీషా. అయితే నజీరుద్దీన్‌ షా వ్యాఖ్యలపై ఇటు హిందువుల నుంచి ..అటు ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే వాటిని సమర్ధిస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముందు ముందు ఈ వివాదాలు దేనికి దారితీస్తాయో చూడాలి!!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-