యూపీపై ఆర్ఎస్ఎస్ ఫోక‌స్‌…ఇదే కార‌ణ‌మా…

వ‌చ్చే ఎడాది దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల కోసం అన్నిపార్టీలు ఇప్ప‌టి నుంచే సిద్దం అవుతున్నాయి.  ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు పావులు క‌దుపుతున్న‌ది.  అధికార‌పార్టీ చేసిన త‌ప్పుల‌ను ఎత్తి చూపి అధికారంలోకి రావాల‌ని చూస్తున్నాయి ప్ర‌తిప‌క్ష‌పార్టీలు.  బీజేపీకి అనుబంధంగా ప‌నిచేస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు యూపీపై దృష్టి సారించింది.  ఆర్ఎస్ఎస్ అధ్య‌క్షుడు మోహ‌న భ‌గ‌త్ ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్నారు.  ఢిల్లికీ మరికొంత మంది ఆర్ఎస్ఎస్ ముఖ్య‌నేత‌లు రాబోతున్నారు.  వీరంతా వ‌చ్చే ఎడాది యూపీలో జ‌ర‌గ‌బోయో ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన విధానాల‌పై, క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న‌, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చర్చింబోతున్నారు. వ‌చ్చే ఎడాది మొద‌ట్లోనే యూపీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  అటు బీజేపీ అధిష్టానం యోగి స‌ర్కార్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.  యూపీ బీజేపీలో లుక‌లుక‌లు ఉన్న‌ప్ప‌టీకీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో యోగి స‌ర్కార్ సాధించిన విషయాల‌పై దృష్టి సారించాల‌ని బీజేపీ నేత‌ల‌కు అధిష్టానం సూచించింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-