బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా దోచుకోవాలనే ధ్యాసే కానీ ప్రజల బాగు కోసం ఆలోచన లేదని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గజ్వెల్ లో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడాతూ.. ‘ రాబోయే ఎన్నికల్లో ఏనుగుకు గుర్తుకు , కారు గుర్తుకు మధ్య పోటీ జరగబోతుందన్నారు. నేను ఉన్న, చచ్చినా కాన్షిరామ్, మాయావతి ఆశీస్సులతో నీలి రంగు కండువాలోనే ఉంటాను.. కేసీఆర్, బండి, రేవంత్ మీరందరికి చెప్తున్న మీ దుకాణాలు బంద్ చేసుకోండి. రాబోయేది రాష్ట్రంలో అధికారం బహుజన సమాజ్ వాది పార్టీదేనని ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

అసైన్డ్ భూములు దున్నుకునే అర్హత మా గిరిజన రైతులకు లేదా? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలేనన్నారు. నేను ఎవరిని తిట్టడానికి రాలేదు, నేను వచ్చింది మీరు దోచుకున్న ధనాన్ని మా బహుజన ప్రజలకు ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాబోయేది బహుజన రాజ్యం కాబట్టి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రవీణ్ కుమార్ పిలునిచ్చారు.

Related Articles

Latest Articles

-Advertisement-