‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్లు వాపస్… భారీ నష్టం

“ఆర్ఆర్ఆర్” మూవీ టీం అకస్మాత్తుగా సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది. కరోనా, ఒమిక్రాన్ ల కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే ఈ పాన్ ఇండియా మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశ తప్పలేదు. ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ గా టికెట్లను బుక్ చేసుకున్న వారి పరిస్థితి మరోలా ఉంది. యూఎస్ఏ థియేటర్లు ఇప్పటికే విక్రయించిన ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్‌ల అమౌంట్ రీఫండ్ ప్రక్రియను ప్రారంభించాయి.

Read Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్

‘ఆర్ఆర్ఆర్’ కంటెంట్ డ్రైవ్‌లు యూఎస్ఏకి చేరుకున్నాయి. అంతేకాదు Qubeకి అప్‌లోడ్ కూడా చేశారు. సరిగమ యూఎస్ఏలో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’పై ఉన్న క్రేజ్ కారణంగా యూఎస్ లో 1.5 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ ప్రీ-సేల్స్ జరిగాయి. సినిమా వాయిదా కారణంగా ఇప్పుడు థియేటర్లు ప్రేక్షకులకు డబ్బును వాపస్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కొంతమంది ప్రేక్షకులు టిక్కెట్ల కోసం చెల్లించిన డబ్బును ఇప్పటికే డబ్బును తిరిగి పొందారు. మిగతా వారందరికీ ఒకటి లేదా రెండు రోజుల్లో డబ్బు తిరిగి వస్తుంది. అయితే అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్న యూఎస్ఏ ప్రేక్షకులు ఒక కోటి రూపాయలను కన్వీనియన్స్ ఫీజు కింద కోల్పోయారని తెలుస్తోంది. అది ఇక తిరిగి చెల్లించబడదు.

Related Articles

Latest Articles