“ఆర్ఆర్ఆర్”పై రాజమౌళి మరో అదిరిపోయే స్కెచ్

దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి సొంత మార్కెటింగ్ స్ట్రాటజిలతో సరికొత్త స్కెచ్ లు గీస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సంబంధించి రాజమౌళి చేస్తున్న భారీ ప్లాన్లు చూస్తుంటే షాకింగ్ గా అన్పిస్తోంది. “ఆర్‌ఆర్‌ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఔటింగ్ కోసం భారీగా స్క్రీన్‌లు రాబోతున్నాయి. యూఎస్ లో “ఆర్ఆర్ఆర్” మొత్తం 1000+ స్క్రీన్‌లతో 288 సినీమార్క్ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేస్తోంది. ప్రతి మల్టీప్లెక్స్‌లో “ఆర్ఆర్ఆర్” కోసం మాత్రమే 3, 4 స్క్రీన్‌లు ఉంటాయి.

Read also : ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్

అతిపెద్ద థియేటర్ చైన్ సినిమార్క్ కు సంబంధించి దాదాపు 325+ యూఎస్ఏ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. వాటిలో 90 శాతం మల్టిప్లెక్స్ లలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుండడం విశేషం. దీన్ని బట్టి “ఆర్ఆర్ఆర్” యూఎస్ లో ఏ రేంజ్ లో విడుదల కానుందో ఊహించుకోవచ్చు. ఇప్పటివరకూ యూఎస్ లో భారీ సంఖ్యలో, ప్రదేశాలలో ప్రదర్శితం కానున్న మొదటి భారతీయ చలనచిత్రం “ఆర్ఆర్ఆర్”. గతంలో 207 మల్టీప్లెక్స్‌లతో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ వచ్చింది.

Related Articles

Latest Articles