24న ‘ఆర్ఆర్ఆర్’ మూడోపాట

రిలీజ్ డేట్ ప్రకటించటమే ఆలస్యం ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారంలో వేగం పెరిగింది. ఇటీవల విడుల చేసిన రెండో పాట సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతోంది. రెండో పాటతో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించిన జక్కన్న మూడో పాటకు ముహూర్తం పెట్టాడట. ఈ నెల 24న మూడో పాటను విడుదల చేయబోతున్నాడట. ఈ పాట రిలీజ్ డేట్ తో పాటు టైమ్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ మూడో పాట ముందు రెండు పాటల్ని మించి ఉంటుందంటున్నారు. కీరవాణి కంపోజింగ్ ఆ రేంజ్ లో ఉందట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్, చరణ్ తమ తమ తదుపరి సినిమాలపై దృష్టి పెట్టనుండటంతో ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ను వీలయినంత త్వరగా పూర్తి చేయనున్నారు. జూనియర్ కొరటాల శివ సినిమాతోనూ, చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే ‘ఆర్ఆర్ఆర్’ మూడో పాట ఎంతలా తారక్, చెర్రీ ఫ్యాన్స్ తో చిందులు వేయిస్తుందో చూద్దాం.

Related Articles

Latest Articles