‘ఆర్ఆర్ఆర్’ సోల్ ఆంథెమ్ కు ముహూర్తం ఖరారు..

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ జోరు పెంచేసింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు చిత్ర బృందం. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సైతం అంచనాలను పెంచుకొంటూ వస్తున్నాయి. ఇంకా నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానే ఉండగా.. మూడో పాటకు ముహూర్తం పెట్టారు మేకర్స్.

అందరు అనుకున్నట్లుగానే నవంబర్ 26 న ‘ఆర్ఆర్ఆర్’ మూడో సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘జనని’ అంటూ సాగే ఈ పాట ‘ఆర్ఆర్ఆర్’ సోల్ ఆంథెమ్ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్టర్ లో అజయ్ దేవగన్ ని కూడా చూపించారు. అజయ్ దేవగన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎమోషనల్ గా కనిపించారు. అంతే కాకుండా జెండాపై వందేమాతరం అని ఉండడంతో దేశంకోసం వీరు చేసిన సాహసాలను తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో ‘ఆర్ఆర్ఆర్’ కథను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా.. తారక్ కొమరం భీమ్ గా మెప్పించనున్నాడు.

Related Articles

Latest Articles