ఆర్ఆర్ఆర్ : కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్… రాజమౌళి టార్గెట్ ఆ పండగే ?

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంన్న “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పాడు. అయితే అంతా అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదల కావడానికి కొత్త ముహూర్తం కోసం చూస్తున్నారని, కొత్త రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకానొక సమయంలో “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ విషయం ఎటూ తేలక, మరోవైపు జక్కన్న కూడా “ఆర్ఆర్ఆర్” విడుదల విషయంలో నోరు మెదకపోవడంతో టాలీవుడ్ మొత్తం అయోమయానికి గురయ్యింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్త స్టార్ హీరోల్లో ఆందోళన కలిగించింది.

Read Also : ఫస్ట్ లుక్ : యంగ్ లుక్ లో ఆకట్టుకుంటున్న “అన్నాత్తే”

ఇక “ఆర్ఆర్ఆర్” చివరి షెడ్యూల్ ను “ఉక్రెయిన్”లో పూర్తి చేశాక, తిరిగి హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెడతారని, అందులోనే సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తారనే వార్తలూ విన్పించాయి. కానీ చాలా సైలెంట్ గా చిత్రబృందం మొత్తం షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేసింది. ఆ తరువాత కూడా ఎలాంటి చడీచప్పుడూ లేకుండా సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకుంటున్నారు మేకర్స్. సడన్ గా రాజమౌళి సైలెంట్ అవ్వడంతో సినిమా అనుకున్నట్టుగా అక్టోబర్ 13న వస్తుందా ? లేదా ? అనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. 2022 జనవరి 8నే ఫైనల్ రిలీజ్ డేట్ గా మేకర్స్ ఫిక్స్ చేశారట. ఇక ఈ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడమే తరువాయి అంటున్నారు. ఇందులో ఎంత మేరకు నిజం ఉందొ తెలీదు కానీ… ఈ వార్త మాత్రం స్టార్ హీరోలకు గుబులు రేపే విషయమే అని చెప్పొచ్చు. రాజమౌళి మీద నమ్మకంతో సంక్రాంతికి పోటాపోటీగా సినిమాల విడుదల తేదీలను అనౌన్స్ చేశారు స్టార్ హీరోలు. జనవరి 12న “భీమ్లా నాయక్”, 13న “సర్కారు వారి పాట” 14న “రాధేశ్యామ్” రానున్నాయి. ఈ సినిమాల విడుదలకు ముందు కనీసం వారం కూడా గ్యాప్ లేకుండానే “ఆర్ఆర్ఆర్” విడుదల అవుతుందని వార్తలు రావడం గమనార్హం. అంటే జక్కన్న కూడా సంక్రాంతిని టార్గెట్ చేశాడన్నమాట. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. జనవరి 8ని “ఆర్ఆర్ఆర్” ఫిక్స్ చేసుకుందంటే మాత్రం వార్ వన్ సైడ్ అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు !

Related Articles

Latest Articles

-Advertisement-