“ఆర్ఆర్ఆర్” షూటింగ్ రీస్టార్ట్ అయ్యేది అప్పుడే…?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ వ్యాప్తి తగ్గుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో నెమ్మదిగా మల్లి అన్ని కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ కూడా ఒళ్ళు విరుచుకుంటోంది. ఇప్పటికే నితిన్ “మాస్ట్రో” టీం తన షూటింగ్ ను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ప్రారంభం కాబోతోందట. జూలై 1 నుంచి “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను రీస్టార్ట్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటివరకు ఈ సినిమా 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మిగతా భాగం షూటింగ్ ను పూర్తి చేయడానికి జక్కన్న సిద్ధమవుతున్నాడు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ పలుమార్లు ఆగిపోవడంతో అనుకున్న టైంకు సినిమా పూర్తి కావడం కష్టమని, అక్టోబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రాయడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ తదితర ప్రముఖులు నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-