“ఆర్ఆర్ఆర్” రన్ టైమ్ ఎంతంటే ?

టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”. చాలా సస్పెన్స్ తరువాత “ఆర్ఆర్ఆర్” ను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నాము అని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితమే పూర్తి కాగా, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హీరోలిద్దరూ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా రన్ టైం ఎంతనే విషయం సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందే. సినిమా అవుట్ ఫుట్ మొత్తం దాదాపు మూడు గంటలకు పైగా రాగా, దానిని ట్రిమ్ చేసి అనవసరమైన సన్నివేశాలను తొలగించారట. మొత్తానికి జక్కన్న ఈ సినిమాను చెక్కి చెక్కి 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చాడట. రాజమౌళి సినిమా అవుట్ ఫుట్ విషయంలో ఏమాత్రం రాజీపడరన్న విషయం తెలిసిందే.

Read Also : ప్రియుడితో రకుల్ బ్రేకప్… పాపులర్ జ్యోతిష్యుడి జోస్యం

ఆయనకు సంతృప్తికరంగా అన్పించే వరకూ సినిమాను చెక్కుతూనే ఉంటారు. అందుకే ఆయన సినిమా అంటే అంత సమయం పడుతుంది. ఒకసారి ఆయన సినిమా అవుట్ ఫుట్ తో సంతోషంగా ఫీల్ అయ్యారంటే తెరపై బొమ్మ ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ‘బాహుబలి’తో ప్రపంచం మొత్తం చూసేసింది. కాబట్టి ఈ సినిమాపై కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక త్వరలోనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ప్రమోషన్ల కోసం రాజమౌళి సరికొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. కల్పితగాథతో రాజమౌళి ఎవరి అంచనాలకు అందకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, శ్రియ శరన్, అజయ్ దేవగన్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య తన బ్యానర్ పై అత్యంత్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

Related Articles

Latest Articles