“ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ షురూ !

అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్” షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. దీంతో ఎట్టకేలకు ఈ చిత్ర ప్రమోషన్లను ప్రారంభించాలని ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మరికొన్ని వారాల్లో వరుస అప్డేట్లతో ఈ బృందం ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది అంటున్నారు. దర్శకుడు రాజమౌళి జూలై చివరి నాటికి “ఆర్‌ఆర్‌ఆర్” మొత్తం షూటింగ్ ను పూర్తి చేసి, నిర్మాణానంతర పనులపై దృష్టి పెట్టబోతున్నారు.

Read Also : “నారప్ప” నుంచి “చలాకీ చిన్నమ్మి” వచ్చేసింది!

ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రెండు భాషల్లో “ఆర్ఆర్ఆర్” డబ్బింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా… అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా ఈ పాన్-ఇండియా చిత్రం రాబోతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-