భారీ రేటుకు “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ !

ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సాంగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఆ తరువాత అలియా ముంబై వెళ్ళిపోయింది. మరోవైపు చిత్రబృందం భారీ ప్రమోషన్ల కోసం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్, ఓటిటి రైట్స్ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి. తాజాగా సినిమా ఆడియో రైట్స్ కు భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

Read Also : సీనియర్ హీరోయిన్ తో జతకట్టబోతున్న కార్తీ

“బాహుబలి” ఆడియో హక్కులను పొందిన లహరి మ్యూజిక్ “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ ను రికార్డు ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ ను ఈ సంస్థ సొంతం చేసుకుందట. హిందీ ఆడియో రైట్స్ మాత్రం బాలీవుడ్ కు చెందిన ప్రసిద్ధ సంస్థ సొంతం చేసుకుంది. అయితే ఆ అమౌంట్ ఎంత అనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఆడియో హక్కులకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. “ఆర్ఆర్ఆర్” బృందం మొదటి సాంగ్ ను రిలీజ్ చేయాలనుకుంటున్న తరుణంలో ఈ న్యూస్ ఆసక్తికరంగా మారింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-