ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్… బెంగళూరు టార్గెట్..?

ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు తరపున వచ్చిన కొత్త ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (7) ఆకట్టుకోలేకపోయిన ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్(46) రెచ్చిపోయాడు. కానీ గేల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన వారు నిరాశపరిచారు. కానీ ఆ జట్టు కెప్టెన్ రాహుల్ 91 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అతనికి తోడు ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్ (25) రాణించడంతో పంజాబ్ నిర్ణిత  20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఇక బెంగళూరు బౌలర్లలో కైల్ జామిసన్ రెండు వికెట్లు తీయగా  షాబాజ్ అహ్మద్, డేనియల్ సామ్స్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీసేన గెలవాలంటే 180 పరుగులు చేయాలి. అయితే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న బెంగళూరు బ్యాట్స్మెన్స్ ఈ మ్యాచ్ లో ఏం చేస్తారు అనేది చూడాలి.

Related Articles

Latest Articles