ట్రైలర్ టాక్: ‘రౌడీ బాయ్స్’ వలన చిక్కులో పడ్డ అనుపమ జీవితం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూస్తుంటే యూత్ ఎంటర్ టైన్మెంట్ లా కనిపిస్తోంది.

ట్రైలర్ విహాయానికొస్తే.. కాలేజ్ అంటేనే బోర్ గా ఫీలయ్యే ఒక కుర్రాడు.. అల్లరి చిల్లరగా తిరుగుతూ, తండ్రి చేత తిట్లు తింటూ కాలేజ్ కి వెళ్తాడు. అక్కడ కాలేజ్ ఫెస్ట్ లో తన ఇమేజ్ ని పెంచుకోవడానికి మెడికల్ కాలేజ్ అమ్మాయిని తీసుకురావాలనుకుంటాడు. ఆ క్రమంలోనే డాక్టర్ చదువుతున్న కావ్య(అనుపమ) ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె తనకన్నా పెద్దది అని తెలిసినా ఫెస్ట్ కి తీసుకెళ్లి మెడికల్ కాలేజ్ అబ్బాయిల దృష్టిలో పడతాడు. కావ్యకి దూరముగా ఉండమని మెడికల్ కాలేజ్ గ్యాంగ్.. హీరో కి వార్నింగ్ ఇవ్వడం.. దీంతో ఇరు వర్గాల మధ్య వార్ నడవడం .. ఇక వారిద్దరి మధ్య కావ్య బలవ్వడం చూపించారు. మరి హీరో తన పద్దతి మార్చుకొని కావ్యకు దగ్గరయ్యాడా..? అస్సలు రౌడీ బాయ్స్ వలన కావ్య జీవితం ఏమైంది..? అనేది ట్విస్ట్ గా చూపించారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. బిగ్గెస్ట్ కాలేజ్ సినిమాగా తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ ట్రైలర్ కి హైలైట్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందుకుతుందో చూడాలి.

Related Articles

Latest Articles