‘రౌడీ బాయ్స్’ డేట్ నైట్ ని పరిచయం చేసిన ఐకాన్ స్టార్..

టాలీవుడ్ నిర్మాత శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆశీష్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అగ్ర తారలు దిగి వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి “డేట్ నైట్” వీడియో సాంగ్‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు.

పార్టీ సాంగ్ లా అనిపిస్తున్న ఈ సాంగ్ ని దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రంజిత్ గోవింద్, సమీర భరద్వాజ్ ఆలపించారు. ఇక వీడియో చూస్తుంటే అనుపమ ని ఇంప్రెస్స్ చేసే పనిలో హీరో ఉన్నట్లుగా తెలుస్తోంది. మంచి పార్టీ సాంగ్ లో ఆశీష్ డాన్స్ స్టెప్పులు అదరగొట్టాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఆశీష్ మొదటి హిట్ ని అందుకుంటాడా లేదో చూడాలి.

Related Articles

Latest Articles