సినిమా బ్రతకాలంటే ప్రజలు థియేటర్లో చూడాలి…

‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈరోజు జరిగిన పెళ్లిసందD ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ… ఈ కరోనా సమయంలో మేము చాలా కష్టపడి సినిమా తీసాం. అన్ని కరోనా జాగ్రత్తలతో ఈ సినిమా చేసాం అన్నాడు. ఇక ఈ సినిమా గౌరి చాలా డేడికేటెడ్ అని అన్నారు. ఇక నాకు వెంకటేష్ చాలా ఇష్టం అని చెప్పిన రోషన్ నాకు బోర్ కొట్టినప్పుడలా ఆయన సినిమాలే చూసేవాడిని అని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా సమయంలో అందరికి చాలా సహాయం చేసారు. ఇక ఇన్ని సాధించిన తర్వాత కూడా ఇంకా ఏదో చేయాలి అనుకుంటున్న మీ తపన మమల్ని చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు అని అన్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ వెన్నుముక లాంటిది అని చెప్పాడు. ఇక సినిమా సినిమా తీయడమే మా పని కానీ అది బ్రతకాలంటే ప్రజలు దానిని థియేటర్ కు వచ్చి చూడాలి. ఇప్పుడు దానిని ప్రారంభించారు. మా సినిమా కూడా థియేటర్లోనే చుడండి అని అన్నాడు రోషన్.

-Advertisement-సినిమా బ్రతకాలంటే ప్రజలు థియేటర్లో చూడాలి…

Related Articles

Latest Articles