ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సెన్సార్ పూర్తి!

ఓ పక్క దర్శకుడు పూరి జగన్నాథ్, ఆయన ఫిల్మ్ పార్ట్ నర్ ఛార్మి ఇ. డి. కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతుంటే… వారి సినిమా ‘రొమాంటిక్’ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లిట్ చేసుకున్న ‘రొమాంటిక్’ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలనూ జరిపేసుకుంది. ఆకాశ్ పురి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీకి పూరి జగన్నాథ్ కథ, కథనం, సంభాషణలు అందించారు. అనిల్ పాదూరి దీనికి దర్శకత్వం వహించారు. ఛార్మి కౌర్ తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను పూరి జగన్నాథ్ నిర్మించారు. సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ ఇవ్వకుండా, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని నిర్మాతలు తెలిపారు. కేతిక శర్మ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘రొమాంటిక్’ కు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు. అతి త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు పూరి జగన్నాథ్ తెలిపారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-