బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ కి గెస్ట్ గా రోజా.. ఇక మోత మోగడం పక్కా …

నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షో.. అన్ స్టాపబుల్ గా కొనసాగుతోంది. ఇప్పటివరకు స్ట్రీమ్ అయిన రెండు ఎపిసోడ్లు అల్టిమేట్ రేటింగ్ తెచ్చుకున్నాయి. బాలకృష్ణ పంచ్ లు, జోకులతో షో అంతా దద్దరిల్లింది. మొదట మోహన్ బాబు, ఆ తరువాత నానితో బాలయ్య రచ్చ రచ్చ చేశారు. ఇక మూడో ఎపిసోడ్ లో బాలయ్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే ఆహా వారు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో కి నటి రోజా గెస్ట్ గా రాబోతుందని తెలుస్తోంది.

బాలకృష్ణకు, రోజాకు రాజకీయ పరంగా గొడవలు ఉన్న సంగతి తెల్సిందే. అయితే వాటన్నింటిని పక్కన పెట్టి వృత్తిపరంగా వీరిద్దరూ నటులు.. ఇద్దరు కలిసి సినిమాలు కూడా చేయడంతో బాలయ్యే స్వయంగా రోజాను తన షో కి గెస్ట్ గా ఆహ్వానించారట.. ఇటీవల రోజా బర్త్ డే కి స్పెషల్ గా ఫోన్ చేసి విషెస్ చెప్పిన బాలయ్య తమ షోకి రావాల్సిందిగా కోరారని, అందుకు రోజా సైతం ఒప్పుకున్నదని సమాచారం. అంతేకాకుండా బాలయ్య హోస్టింగ్ చాలా బావుందని రోజా మెచ్చుకున్నారట.. మోహన్ బాబును రాజకీయ ప్రశ్నలు వేయడంపై ఆమె ప్రశంసించారని తెలుస్తోంది.

త్వరలోనే వీరిద్దరి ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారట. ఇక ఇదే కనుక నిజమైతే రచ్చబండ షో లో రచ్చలేపిన రోజాను బాలయ్య బాబు ఎలాంటి ప్రశ్నలను సంధిస్తాడో చూడాలి. ఇక మరోపక్క ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఒకే వేదికపై కనిపిస్తే మోత మోగిపోవడం ఖాయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles