గోవా బీచ్ లో రణవీర్, పూజా, జాక్విలిన్ రొమాంటిక్ ‘సర్కస్’!

రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రోహిత్ శెట్టి ఎంటర్టైనర్ ‘సర్కస్’. కామెడీ అండ్ యాక్షన్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ మూవీలోని చాలా భాగం ఇప్పటికే షూట్ చేసేశారు. ముంబైలోని ఓ స్టూడియోలో దాదాపుగా సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. కానీ, రోహిత్ శెట్టి సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి ఆయనకు గోవా మీద ఎంత క్రేజో తెలిసే ఉంటుంది. రోహిత్ సినిమాలు అన్నిట్లో గోవాలో పిక్చరైజ్ చేసిన ఒక్క సీనైనా ఉంటుంది. అందుకే, అదే గోవా సెంటిమెంట్ ‘సర్కస్’ విషయంలోనూ కంటిన్యూ చేస్తున్నాడట…

‘సర్కస్’ మూవీ కోసం అక్టోబర్, నవంబర్ నెలల్లో గోవా బయలుదేరతారట. రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్ తో పాటూ లీడింగ్ లేడీస్ పూజా హెగ్డే, జాక్విలిన్ కూడా పాల్గొనే ఈ షెడ్యూల్ లో ప్రధానంగా ఓ పాట చీత్రకరిస్తారని సమాచారం. అంతే కాదు, ‘సర్కస్’లో మరో పెద్ద హైలైట్ దీపికా సాంగ్. మిసెస్ రణవీర్ కూడా రోహిత్ శెట్టి యాక్షన్ కామెడీలో భాగం కానుంది. ఆమె మీద ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని ఇప్పటికే చెప్పారు. చూడాలి మరి, హబ్బీకి మన డీపీ ఎంత వరకూ లక్కీ ఛార్మ్ గా మారుతుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-