ఇక టెస్ట్ వైస్ కెప్టెన్సీ అతనికేనా…?

ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఇన్ని రోజులు ఈ పర్యటన ఉంటుందా.. లేదా అనుకుంటూ ఉండగా… దీని పై ఈరోజు బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. ఈ పర్యటనకు టీం ఇండియా వెళ్తుంది అని… అయితే ఈ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ లు మాత్రమే జరుగుతాయని.. షెడ్యూల్ చేసిన టీ20 సిరీస్ తర్వాత ఉంటుంది అన్ని అన్నారు. అయితే ఈ పర్యటనలో భారత టెస్ట్ వైస్ కెప్టెన్ గా అజింక్య రహానే స్థానంలో రోహిత్ శర్మను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. గాయం కారణంగా ప్రస్తుతం కివీస్ తో రెండో టెస్ట్ ఆడని రహానే.. ఈ పర్యటనకు దూరం అవుతున్నదని తెలుస్తుంది. అందుకే అతని స్థానంలో రోహిత్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు వార్తాలు వస్తున్నాయి. కానీ రహానే వచ్చినా తర్వాత కూడా రోహిత్ అలాగే కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మధ్య ఫామ్ లో లేని రహానే కివీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో రాణించలేదు అనేది తెలిసిందే.

Related Articles

Latest Articles