కోహ్లీ రికార్డ్ సమం చేసిన రోహిత్ శర్మ…

భారత టీ20 జట్టుకు గత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ పేరిట చాలా రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందులో ఓ రికార్డును భారత టీ20 జట్టు యొక్క ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సమం చేసాడు. అదే ఈ పొట్టి ఫార్మాట్ లో అత్యధిక అర్ధ శతకాలు చేయడం. విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ లో ఇప్పటివరకు 29 అర్ధశతకాలు చేయగా.. రోహి శర్మ కూడా నిన్న న్యూజిలాండ్ తో జరిగిన రెండో మ్యాచ్ లో 36 బంతుల్లో 55 పరుగులు చేసాడు. అయితే ఇది రోహిత్ కు 29వ హాఫ్ సెంచరీ. కానీ రోహిత్ కు ఈ రికార్డ్ సాధించడానికి రోహిత్ శర్మ 118 మ్యాచ్ లు తీసుకుంటే.. విరాట్ కేవలం 91 మ్యాచ్‌ లలోనే ఈ ఫిట్ అందుకున్నాడు. భారత జట్టు కివీస్ తో మూడవ మరియు చివరి టీ 20 మ్యాచ్ రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 25 నుండి రెండు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ లో తలపడతాయి.

Related Articles

Latest Articles