టీమిండియా టీ20 కెప్టెన్: కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నియామకం కరెక్టేనా..?

టీంఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి గత కొంతకాలంగా ఎక్కువగా విన్పిస్తుంది. రోహిత్ కే ఎందుకు కెప్టెన్సీ ఇవ్వాలి? అనే అంశంపై స్టాటిస్టిక్స్ తో సహా అభిమానులు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీం ఇండియా ఓడిన ప్రతిసారి ఈ డిమాండ్ తెరపైకి వస్తోంది. సీనియర్లు సైతం రోహిత్ కు పగ్గాలు అప్పగించాలని మద్దతు పలుకుతున్నారు. ఈక్రమంలోనే త్వరలో జరిగే టీ-20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ విషయంలో అనుహ్య మార్పులు జరుగుతాయనే టాక్ బీసీసీఐ వర్గాల్లో విన్పిస్తుంది.

టీ20 ప్రపంచకప్‌ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈక్రమంలోనే టీమ్ సెలెక్షన్‌ను పకడ్బందీగా ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఒప్పించి మరీ మెంటర్‌గా నియమించుకుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఇద్దరు కెప్టెన్సీల విధానాన్ని తీసుకువచ్చేందుకు బీసీసీఐ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. టెస్టుల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని కొనసాగించి.. వన్డే సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని భావిస్తుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సమావేశాల్లో సమాలోచనలు జరిగినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది.

బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ఈవెంట్లో రోహిత్ శర్మ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సారథిగా అతడు ముంబైకి ఐదుసార్లు టైటిల్స్ తెచ్చిపెట్టాడు. మరోవైపు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే అతడు ఒక్కసారి కూడా ఆ జట్టుకు టైటిల్ తేలకపోయాడు. దీంతో కోహ్లీ కంటే రోహిత్ కెప్టెన్ గా బెటరనే చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కోహ్లీ కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో తడబడుతున్నాడు. సారథిగానే కాకుండా బ్యాట్స్ మెన్ గా విఫలం అవుతున్నాడు. దీంతో అతడిపై కెప్టెన్సీ భారం పడుతుందనే అభిప్రాయం వ్యకం అవుతోంది.

కోహ్లీ సారథ్యంలో టీంఇండియా ఓడినప్పుడల్లా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తుండటంతో దీనిపై బీసీసీఐ సైతం దృష్టిసారించింది. ఈక్రమంలోనే బీసీసీఐ సైతం ఇద్దరు కెప్టెన్సీ విధానాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈలో జరగనున్న టీ 20 తర్వాత ఈ మార్పు ఉంటుందని సమాచారం అందుతోంది. దీంతో టెస్టుల్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నారని తెలుస్తోంది. మొత్తానికి బీసీసీఐ తీసుకోనున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే..!

Related Articles

Latest Articles

-Advertisement-