‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ‘గల్లీ బాయ్’తో మరోసారి గార్జియస్ ఆలియా!

రణవీర్ సింగ్, ఆలియా భట్… ఈ జోడీ చాలు థియేటర్ కి ప్రేక్షకులు రావటానికి! ఇప్పటికే ‘గల్లీ బాయ్’ సినిమాలో కలసి నటించిన ‘ఆర్ఎస్’ అండ్ ‘ఏబీ’ యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టార్సే! అందుకే, వారిద్దరితో తనదైన స్టైల్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తలపెట్టాడు కరణ్ జోహర్!

‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తాజా చిత్రం టైటిల్. ట్విట్టర్ లో స్వయంగా ప్రకటించిన ఆయన మరికొన్ని బిగ్ నేమ్స్ ఆఫ్ బాలీవుడ్ కూడా మెన్షన్ చేశాడు! ‘రాకీ’గా రణవీర్, ‘రాణీ’గా ఆలియా నటిస్తుండగా… వారి గ్రాండ్ పేరెంట్స్ గా ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ కనిపించబోతున్నారు! ధర్మేంద్ర, షబానా అజ్మీ మనవరాలు ఆలియా కాగా జయ బచ్చన్ మనవడు రణవీర్. ఈ తరం ప్రేమికులు ‘రాకీ అండ్ రాణీ’ మధ్య లవ్… అలాగే, దర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ పాత్రల మధ్య ఎమోషనల్ డ్రామా సినిమాలో హైలైట్ గా ఉంటాయట!

ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ కు దర్శకుడిగా చివరి చిత్రం ‘యే దిల్ హై ముష్కిల్’. ఆ సినిమా తరువాత 5 ఏళ్ల గ్యాప్ తీసుకున్న కేజో ఇప్పుడు తనకు బాగా అలవాటైన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మరోసారి డైరెక్టర్ కుర్చీలో కూర్చోబోతున్నాడు. నిజానికి ఆయన ‘తఖ్త్’ అనే పీరియాడికల్ రాయల్ డ్రామా తెరకెక్కిద్దామనుకున్నాడు. గత కొంత కాలంగా తన పేరు రకరకాల వివాదాల్లో వినిపిస్తూ ఉండటంతో భారీ బడ్జెట్ హిస్టారికల్ ప్రాజెక్ట్ నుంచీ వెనక్కు తగ్గాడు. ‘గల్లీ బాయ్’తో సక్సెస్ ఫుల్ గా వర్కవుట్ అయిన రణవీర్, ఆలియా కాంబినేషన్ తో సేఫ్ గేమ్ ఆడబోతున్నాడు. చూడాలి మరి, ‘కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో న హో’ లాంటి ఎంటర్టైనర్స్ అందించిన కరణ్ కి ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ అందిస్తుందో…

‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ‘గల్లీ బాయ్’తో మరోసారి గార్జియస్ ఆలియా!
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-