యూపీలో బ‌స్సు ప్ర‌మాదంః 16 మంది మృతి…

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో 16 మంది మృతి చెందారు.  ఆరుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  కాన్పుర్ కు స‌మీపంలోని స‌చేండి జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  వేగంగా ప్ర‌యాణం చేస్తున్న బ‌స్సు ఓ లోడ‌ర్‌ను ఢీకొట్టి బోల్తా ప‌డింది.  ఈ ప్ర‌మాదంలో 16 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  గాయ‌ప‌డిన వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు పోలీసులు చెబుతున్నారు.  ఈ ఘ‌ట‌నపై  ప్ర‌ధాని తీవ్ర‌దిగ్బాంతిని వ్య‌క్తం చేశారు.  బాధిత కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించారు.  అదే విధంగా యూపీ ముఖ్య‌మంత్రి ఆదిత్యానాథ్ కూడా మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియాను ఇస్తామ‌ని హామి ఇచ్చారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-