పాక్‌లో రోడ్డు ప్ర‌మాదం…30 మంది మృతి…

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం చోటుచేసుకుంది.  పంజాబ్ ప్రావిన్స్‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 30 మంది మృతి చెందారు.  మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు.  ఈ ప్ర‌మాదంలో 40 మందికి గాయాలయ్యాయి.  బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి ర‌జ‌న్‌పూర్‌కు ప‌య‌న‌మ‌య్యారు.  వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ముజ‌ప్ప‌ర్‌గ‌డ్‌లోని డేరాఘాజీ ఖాన్ వ‌ద్ద ఇండ‌స్ హైవేపై ఎదురుగా వ‌స్తున్న కంటైన‌ర్‌ను ఢీకొన్న‌ది.  ఈ ప్ర‌మాదంలో 30 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  గాయ‌ప‌డిన వారిని ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.  మ‌రో గంట‌న్న‌ర‌లో ఇంటికి చేరుకుంటామ‌న‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.  ఇక చికిత్స‌పొందుతున్న వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read: సూర్య సినిమా సంగీత దర్శకుడి కన్నుమూత

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-