పెళ్లింట విషాదం : ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. 15 మంది

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఓ మహిళా మృతి చెందింది. అంతేకాదు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జువ్వాడి నుంచి కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగే వివాహానికి కొందరు ట్రాక్టర్ లో పెళ్లి సామగ్రితో తీసుకెళ్తున్నారు. కృష్ణాజివాడి వద్దకు రాగానే ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వైద్యం నిమిత్తం హుటాహుటిన కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతూ ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-