ప్రమాదంలో యువకుడు బలి… అధికారుల నిర్లక్ష్యమే అంటున్న స్థానికులు

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ లో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి అయ్యాడంటూ స్థానికులు అంటున్నారు. రామ్ చరణ్ ఆయిల్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడ్డాడు యువకుడు. యువకుని పై నుండి దూసుకు వెళ్ళింది కంటైనర్. స్పాట్ లోనే మృతి చెందాడు యువకుడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఆ స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్నారు మైలార్ దేవిపల్లి పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను క్లీయర్ చేసారు. మృతుడు శ్రీరామ్ కాలనీ కి చెందిన శివగా గుర్తించారు. ఉద్యోగం ముగించుకోని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గత 9 నెలల క్రితం వివాహం చేసుకున్న శివ. రోడ్డు సరిగ్గా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడంటూ ఆరోపిస్తున్నారు స్థానికులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొడుకును చూసి తల్లడిల్లి పోయింది తల్లి. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవిపల్లి పోలీసులు.

-Advertisement-ప్రమాదంలో యువకుడు బలి... అధికారుల నిర్లక్ష్యమే అంటున్న స్థానికులు

Related Articles

Latest Articles