రావిర్యాల్ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. ఔటర్ రింగురోడ్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. తాజాగా ఓ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆగి వున్న లారీని ఢీ కొంది ఓట్రక్. దీంతో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్ లో ఇరుక్కుపోయిన క్లీనర్, తనను కాపాడాలంటూ అరుపులు కేకలు వేశాడు. 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు వాహనదారులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇరుక్కుపోయిన క్లీనర్ ను తీయడానికి తీవ్రంగా శ్రమించారు పోలీసులు. 4 గంటల పాటు శ్రమించి క్లీనర్ ను బయటకు తీశారు పోలీసులు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, క్లీనర్ పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. శంషాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా పెద్ద అంబర్ పేట్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పొలీసులు.

Related Articles

Latest Articles