ఏపీలో కొత్తగా 840 కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 840 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,79,763 కి పెరిగిందిఒక్క రోజు వ్యవధిలో మరో ఒకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 501 కి చేరింది.

Read Also: ఓయూలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా

ప్రస్తుతం రాష్ట్రంలో 2972 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 133 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 37,849 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,15,29,919 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2062290 లక్షలకు చేరింది. అటు ఏపీలో.. ఇప్పటి వరకు 28 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

Related Articles

Latest Articles