మళ్ళీ మొదలైన ‘రైడ‌ర్’ మూవీ షూటింగ్

మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవ‌గౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార‌స్వామి తనయుడు నిఖిల్ కుమార్ 2016లో ‘జాగ్వర్’ మూవీతో తెలుగు వారి ముందుకొచ్చాడు. ఆ తర్వాత కన్నడ సినిమాలు ‘సీతారామకళ్యాణం’, ‘కురుక్షేత్ర’లో నటించాడు. ‘కురుక్షేత్ర’ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. తాజాగా నిఖిల్ కుమార్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ‘రైడ‌ర్‌’ మూవీలో నటిస్తున్నాడు. కాశ్మీరా ప‌ర‌దేశి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని చంద్ర మనోహరన్ నిర్మిస్తున్నారు. ల‌హ‌రి మ్యూజిక్ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణ‌రంగంలోకి అడుగుపెట్టింది. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా శ్రీషా కుడువల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఇప్ప‌టికే విడుద‌లైన ‘రైడ‌ర్‌’ మోష‌న్‌పోస్ట‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిందని, ఆదివారం నుండి మూవీ చిత్రీక‌ర‌ణ తిరిగి ప్రారంభించామని నిర్మాత తెలిపారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ద‌త్త‌న్న‌, అచ్యుత కుమార్‌, రాజేష్ న‌ట‌రంగ‌, శోభ‌రాజ్, నిహారిక‌, సంప‌ద‌, అనూష‌ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-