రాహుల్ ద్రావిడ్ పై హాట్ కామెంట్స్ చేసిన ‘షకీలా’ బ్యూటీ

‘షకీలా’ బయోపిక్ తు అటు హిందీ, ఇటు తెలుగువారికి సుపరిచితురాలిగా మారింది రిచా చద్దా. అందచందాలను ఆరబోయడంలో అమ్మడికి అమ్మడే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పై హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. టీమ్ ఇండియాకు చీఫ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ ని పొగడ్తలతో ముంచెత్తింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన రిచా మాట్లాడుతూ” నాకు చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం.. నా తమ్ముడి క్రికెట్ ఆడడానికి వెళ్తే.. అతనితో పాటు నేను కూడా వెళ్లేదాన్ని. టీనేజ్ లో నాకు రాహుల్ ద్రావిడ్ అంటే క్రష్. టీవీలో ఆయన కనిపిస్తున్నాడు అంటే అన్ని పనులు మానేసి మ్యాచ్ చూస్తూ కూర్చోనేదాన్ని.. ఆయనంటే అంత ప్రాణం.. ఆ తరువాత రాహుల్ క్రికెట్ వదిలేశాక .. నేను కూడా చూడడం మానేశాను.. ఇప్పుడు మళ్లీ రాహుల్ టీమ్ ఇండియాకు చీఫ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ నేను క్రికెట్ చూస్తాను.. టీమిండియాను గెలిపించడానికి ఆయన ఎంతో కష్టపడతారు..” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles