‘ఆ యంగ్ బ్యూటీ’యే సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసిందట! రియా చక్రవర్తి షాకింగ్ స్టేట్మెంట్!

మరికొద్ది రోజుల్లో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి వర్ధంతి రాబోతోంది. అయితే, మొదట్లో పెను సంచలనంగా మారిన అనుమానాస్పదం కేసు తరువాత క్రమంగా వార్తల్లోంచి తప్పుకుంది. కానీ, ఈ మధ్యే సుశాంత్ రూమ్ మేట్ సిద్ధార్థ్ పితాని పోలీసులకు చిక్కాడు. అతడ్ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటువంటి సమయంలో రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మీడియా చేతికి చిక్కింది. అందులో సారా అలీఖాన్ పేరు కూడా ఉండటంతో బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది.

సుశాంత్ గాళ్ ఫ్రెండ్ గా విపరీతమైన పాప్యులారిటీ సంపాదించిన రియా చక్రవర్తి ఆయన మృతి కేసులో నిందితురాలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆమెని అప్పట్లో అరెస్ట్ చేశారు. నెల పాటూ జైల్లో ఉంచారు. ఆ క్రమంలో జరిగిన విచారణలో భాగంగా రియా ఎన్సీబీ అధికారులకి సారా పేరుని కూడా చెప్పిందట! ఆమెతో పాటూ కొన్నాళ్ల రియా జిమ్ లో వర్కవుట్స్ చేసేది. ఒకే జిమ్ కావటం ఇద్దరి మధ్యా ఫ్రెండ్ షిప్ పెరిగింది. ఆ సమయంలో రియాకి సారా తన వద్ద ఉన్న ‘హ్యాండ్ రోల్ జాయింట్స్’ ఆఫర్ చేసిందట. జాయింట్స్ అంటే ఒక విధమైన పోగాకుతో చుట్టిన చుట్టలు! ఆమె అవి వాడేదనీ, తనకు కూడా ఇచ్చిందనీ… రియా చెప్పిందట!

సారా అలీఖాన్ గంజాయి అలవాటు గురించి మరిన్ని సంచలన వివరాలు తెలిపింది రియా చక్రవర్తి! ‘కేదార్ నాథ్’ సినిమాలో కలసి నటించిన సుశాంత్, సారా అలీఖాన్ 2018-19 సంవత్సరాల్లో కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అదే సమయంలో మత్తు పదార్థం సేవించటం సుశాంత్ కి సారా నుంచీ అలవాటైందట. హ్యాంగోవర్ పోవాలంటే జాయింట్స్ ఊదటమే మంచి మార్గమని యంగ్ బ్యూటీ చెప్పేదట. ఇవన్నీ ఎన్సీబీ ఆఫీసర్స్ కి చెప్పిన రియా, థాయిలాండ్ లో సుశాంత్ 70 లక్షలు ఖర్చు చేసి స్నేహితులతో పార్టీ చేసుకున్నాడని చెప్పటం… బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. అతని వెంట అప్పట్లో సారా కూడా ఉందని రియా చక్రవర్తి చెబుతోంది.

సారా అలీఖాన్ తనపై వస్తోన్న డ్రగ్స్ ఆరోపణల్ని ఎలా తిప్పికొడుతుందో చూడాలి. ఇప్పుడు సుశాంత్ రూమ్ మేట్ సిద్ధార్థ్ పితానీ కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా కేసు సారా మెడకి కూడా చుట్టుకోవచ్చు! అంతే కాదు, ముందు ముందు సుశాంత్ వ్యవహారంలో మరికొన్ని బీ-టౌన్ బిగ్ నేమ్స్ కూడా బయటకు రావచ్చు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-