ఓటీటీలో వర్మ ‘డి కంపెనీ’ ఎప్పుడంటే….

‘సత్య’ మూవీతో ముంబై అండర్ వరల్డ్ దృష్టిలో పడటమే కాదు ఆ చీకటి సామ్రాజ్యాన్ని సినిమా ప్రేక్షకులకూ రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన ‘కంపెనీ’ మూవీ సైతం చక్కని ప్రేక్షకాదరణ పొందింది. ఆ ఊపుతో అదే జానర్ లో మరి కొన్ని సినిమాలు తీశాడు కానీ ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. మళ్ళీ ఇంతకాలానికి వర్మ ముంబై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘డి-కంపెనీ’ మూవీ తీశాడు. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా నిజానికి మార్చి 26న విడుదల కావాల్సింది. కానీ కరోనా కేసులు పెరగడంతో రిలీజ్ ను వాయిదా వేశారు. తాజాగా వర్మ మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ కాకుండా, చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన స్పార్క్ ఓటీటీలోనే ఈ మూవీని ఈ నెల 15న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలిపాడు. గత యేడాది వర్మ తెరకెక్కించిన కొన్ని సినిమాలు ఏటీటీ ద్వారా చూసే ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడీ ఓటీటీ సబ్ స్క్రిబిషన్ ఎంత? ఈ సినిమాను ఎలా చూడొచ్చు? అనే వివరాలను మాత్రం ఇంకా తెలియచేయలేదు. అక్షత్ కాంత్, ఇర్రా మోర్, నైనా గంగూలీ, రుద్ర కాంత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో అప్సరా రాణి ఐటమ్ సాంగ్ లో నర్తించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-