‘జాతీయ రహదారి’ ట్రైలర్ లాంచ్ చేసిన ఆర్జీవి

మధు చిట్టె , సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘జాతీయ రహదారి’. పలు అవార్డ్ విన్నింగ్ చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ‘కరోనా పాండమిక్ లో జరిగిన రెండు ప్రేమకథలకు దర్శకుడు నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి అవార్డులు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

‘ఆర్జీవీ తన మనసుకు నచ్చని పని ఏదీ చేయరని, ఈ ట్రైలర్ చూసి, నచ్చి, దానిని విడుదల చేయడానికి అంగీకరించార’ని నిర్మాత రామ సత్యనారాయణ చెప్పారు. ఈ రోజున తాను ఈ స్థాయిలో ఉండటానికి వర్మ దర్శకత్వంలో నిర్మించిన సినిమాలే కారణమని ఆయన అన్నారు. వినాయక చవితి కానుకగా ‘జాతీయ రహదారి’ చిత్రాన్ని ఈ నెల 10న రెండు తెలుగు రాష్ట్రాలలోని రెండు వందల థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, ‘రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమా చూసి, స్ఫూర్తి పొంది చెన్నయ్ రైలు ఎక్కిన వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని, అలాంటి గొప్ప దర్శకుడు తన సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంద’ని అన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-