రేపు మంత్రి పేర్నినానితో ఆర్జీవీ భేటీ..

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం జీవో నెం 35ను ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు నిర్ణయించి ఆ ధరలకంటే ఎక్కువకు అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేయడంతో మరోసారి హైకోర్టు ఏపీ సినిమా టికెట్లపై విచారణ చేపట్టింది.

ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు రామ్‌గోపల్‌ వర్మ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ 10 ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా వీలైతే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానికి కలుస్తానని అందుకు అవకాశం ఇవ్వాలని ట్విట్టర్‌ వేదికగా కోరారు. దీంతో మంత్రి పేర్నినాని ఈ నెల 10 తేదీన ఆర్టీవీకి భేటీ అయ్యేందుకు ఆహ్వానించారు. దీంతో రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయంలో పేర్ని నానితో ఆర్టీవో భేటీ కానున్నారు. అయితే రేపు ఉదయం 11.45గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్జీవీ చేరుకుంటారు.

Related Articles

Latest Articles