హారర్ మూవీ ఫ్రాంచైజ్ లో మరో సీక్వెల్… ఆర్జీవీ సన్నాహాలు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైవిధ్యమైన హారర్ మూవీస్ ఫ్రాంచైజ్ ను కొనసాగించబోతున్నారు. తాజాగా ఆయన మరో హారర్ మూవీ సీక్వెల్ కు ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. 2014లో “ఐస్ క్రీమ్” ఫ్రాంచైజీలో తక్కువ బడ్జెట్ ఎరోటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. మొదటి భాగంలో నవదీప్, తేజస్వి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే థ్రిల్ చేసింది. అదే ఫ్రాంచైజ్ లో రెండవ చిత్రంగా మృదుల భాస్కర్ ప్రధాన పాత్రలో “ఐస్ క్రీమ్-2” మూవీని రూపొందించారు. ఈ సినిమాకు మాత్రం భిన్నమైన టాక్ వచ్చింది.

Read Also : ఎన్టీఆర్ పాపులర్ షోకు ఫస్ట్ గెస్ట్ గా స్టార్ హీరో

ఇప్పుడు ఆర్జీవీ “ఐస్ క్రీమ్” ఫ్రాంచైజీలో మూడవ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఐస్ క్రీమ్ 1, 2లను నిర్మించిన సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మూడవ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా తారాగణం, సిబ్బంది వివరాలు రానున్న రోజుల్లో ప్రకటించనున్నారు. కాగా కరోనా రోజుల్లోనూ ఆర్జీవీ వరుసగా ఓటిటి వేదికపై సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందుకే నేక్డ్, థ్రిల్లర్, కరోనా వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక బ్రూస్ లీ, మర్డర్ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-