టికెట్ రేట్ల ఇష్యూ… ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం

ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సంచలనంగా మారింది. థియేటర్ల యాజమాన్యంతో సినిమా సెలెబ్రిటీలు కూడా చాలా మంది ఈ వివాదంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం మరోమారు ఆలోచించుకోవాలని కోరారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ పరిష్కరించాలని బహిరంగ వేదికలపైనే విన్నవించుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఆ విన్నపాలు ఏమాత్రం కరగలేదు. అంతేకాదు సినిమా టికెట్ రేట్ల విషయంలో తగ్గేదే లే అని, ఎవరూ ఆ విషయం గురించి చర్చించడానికి ప్రయత్నించవద్దని చెప్పారు. అంతేకాదు ఈ పనిని తాము పేదల కోసమే చేస్తున్నాము అంటూ ఏపీ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. తాజాగా ఈ వివాదంపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్

ఇన్ని రోజులూ ఈ వివాదంలో సైలెంట్ గా ఉన్న ఆర్జీవీ ఇటీవల తాను దర్శకత్వం వహించిన ‘ఆశ’ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయంపై స్పందించారు. ప్రాడక్ట్ ను తయారు చేసిన వారికే దాని రేటును నిర్ణయించే హక్కు ఉంటుందని అన్నారు. ఇక ఆ వివాదం గురించి తనకేమీ తెలియదని చెప్పిన రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోమారు ఈ విషయంపై మరింత స్పష్టంగా మాట్లాడారు. ఆర్జీవీ మాట్లాడుతూ ఇడ్లీని ఉదహరించారు. ఎవరైనా హోటల్లో ఇడ్లీని తక్కువ ధర రూ.50కి అమ్మితే, మరొకడు వచ్చి ఏదో చెప్పి అదే ఇడ్లీని రూ.500లకు అమ్మొచ్చు. వాడు దేనికి అంత ధర పెట్టాడు అన్నది విషయం కాదు. 50 రూపాయలకు దొరికే ఇడ్లిని పక్కనే 500లకు కొని తింటున్నాడు అంటే అది వాళ్ళ ఇష్టం. స్థోమతను బట్టి తింటారు. ఎవడూ గన్ పెట్టి బెదిరించరు. అంతేకాదు ఈ టికెట్ ధరలకు బట్టలు, మెర్సిడెజ్ బెంజ్ కార్లను కూడా ఉదాహరణగా వివరించారు.

ఏది నిత్యావసర వస్తువు ? ఎంటరైన్మెంట్ నిత్యావసర వస్తువు అని ఎలా డిఫైన్ చేస్తారు ? తెలుగు సినిమా చరిత్రకు 100 కోట్లు లిమిటేషన్ మార్కెట్ ఉందని అనుకుంటున్న రోజుల్లో… రాజమౌళి, శోభు యార్లగడ్డ 200 కోట్లు పెట్టారు అంటే… ఎందుకు ? వాళ్ళ ప్రాడక్టుపై వాళ్లకు అంత నమ్మకం ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళకే నష్టం.. హిట్ అయితే ఇండస్ట్రీ మొత్తానికి లాభం అంటూనే ఎమ్ఆర్పీ అనేది అసలు ఎందుకు వచ్చిందో కూడా వివరించారు. ఇక సినిమా హీరోలకు 70 శాతం హీరోలకు, మేకింగ్ కాస్ట్ 30 శాతం అవుతుందని పేర్ని నాని అంటున్నారు. అది ఫండమెంటల్ గా తప్పు. మేకింగ్ కాస్ట్ అంటే ఏంటి ? హీరోకు డబ్బులు ఇవ్వడం కూడా అదే అవుతుంది… జనం వచ్చేది హీరోను చూడడానికే… అంటూ ఏపీలో జరుగుతున్న వివాదంపై చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు. ఫైవ్ స్టార్ హోటల్లో కూడా బయటవాడే అది సరుకే వాడతారు. అప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఖర్చు బయట ఉన్నట్టే ఉండాలిగా ? ఎందుకు లేదు ? మరి మాములు షర్ట్, బ్రాండెడ్ షర్ట్ కు ఎందుకు లేదు ? అంటూ ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇది ఎవరినీ బ్లేమ్ చేసి చెబుతున్నది కాదంటూ వీడియో మొదట్లోనే ఆయన చెప్పడం కొసమెరుపు.

Related Articles

Latest Articles