‘డిగ్నిటీ’ అంటూ పేర్ని నానికి ఆర్జీవీ సమాధానం !

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. నిన్నటి నుంచి సినిమా ఇండస్ట్రీ తరపున ఆర్జీవీ, ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్జీవీ ప్రభుత్వానికి ప్రశ్నలతో ముంచెత్తుతుంటే, నాని కూడా తగ్గేదే లే అన్నట్టుగా సమాధానాలతో పాటు మరిన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ట్విట్టర్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని వంటి కొంతమంది హీరోలు ఈ విషయంపై ఫైర్ అయ్యారు. అయితే ఆర్జీవీ తెరపైకి వచ్చాక ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం పరిస్థితి ఆర్జీవీ వర్సెస్ పేర్ని నానిగా మారింది. ఇక ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలు ఇప్పటికైనా నోరు విప్పుతారనే ఆశాభావాన్ని ఆర్జీవీ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘డిగ్నిటీ’ అంటూ పేర్ని నాని వేసిన ప్రశ్నలకు ఆర్జీవీ సమాధానం ఇవ్వడం వైరల్ అవుతోంది. అసలు పేర్ని నాని ఏం అన్నారు ? దానికి ఆర్జీవీ ఎలా స్పందించారో వాళ్ళ ట్వీట్స్ లోనే చూద్దాం.

Read Also : జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు

Related Articles

Latest Articles