సిద్దిపేట మాజీ కలెక్టర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు !

సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట రామిరెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత వివాదాస్పద వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డిఅని… కేసీఆర్ కి ఈయన ప్రీతి పాత్రుడని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందని… రెవెన్యూ ఆదాయం కొల్లగొట్టేందుకు కేసీఆర్… వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుప్పం నియోజక వర్గ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.


చంద్రబాబుకి వెంకట్ రామ్ రెడ్డి అత్యంత సన్నిహితుడని…వైఎస్సార్ హయాంలో అవుటర్ రింగ్ నిర్మాణంలో అవక తవకలకు పాల్పడ్డాడని నిప్పులు చెరిగారు. వైఎస్సార్ ను ప్రసన్నం చేసుకొని విచారణ నుంచి తప్పించుకున్నాడని… రోశయ్యను ప్రసన్నం చేసుకొని ఐఏఎస్ అవతారం ఎత్తాడని ఫైర్‌ అయ్యారు. చిత్తూరు తాగునీటి పథకం కింద భారీ ఎత్తున కమీషన్లు ముట్టాయని వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు చేశారు. కరుడు గట్టిన సమైక్య వాదులకు ప్రీతి పాత్రులు గా ఉన్న వ్యక్తులకు ఎలా పదవులు ఇచ్చారని… తెలంగాణ త్యాగాల పట్ల కేసీఆర్ కి గౌరవం లేదని ఆగ్రహించారు. ఇప్పటి మంత్రి హరీష్ రావు గతంలో వెంకట్ రామ్ రెడ్డి పై పిర్యాదు చేశాడని గుర్తు చేశారు. చిత్తూరు తాగునీటి పథకం లో అవినీతి జరుగుతుందని వెంకట్ రామ్ రెడ్డిపై హరీష్ రావు పిర్యాదు చేశారన్నారు.
ముఖ్యమంత్రులను మెప్పించడం వెంకట్రామిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.

Related Articles

Latest Articles