ఇది ప్రాణాలు తీసే ప్రభుత్వం: రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ఇటీవల జరిగిన బదిలీలపై మనస్తాపం చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్‌లో చోటుచేసుకుంది. బాబాపూర్‌కు చెందిన సరస్వతి ఇప్పటివరకు స్వగ్రామంలోనే పనిచేసింది. ఇటీవల ఆమెను నిజామాబాద్‌ జిల్లా నుంచి కామారెడ్డికి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాకు బదిలీ చేశారు. దాంతో మనస్తాపం చెందిన సరస్వతి ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Read Also: చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు నమ్మరు: అప్పల రాజు

కాగా 317 జీవో పై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. మరోసారి ట్విట్టర్‌ వేదికగా ..ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోంది. దానికి తాజా ఉదంతం బీంగల్ మండలం, బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య. అడ్డగోలు బదిలీతో మనస్థాపం చెంది సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారు. 317 జీవో విడుదలైన దగ్గర నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో గుండె ఆగో… బలవన్మరణానికి ఒడిగట్టో ప్రాణాలు వదులుతున్నారు. ఉద్యోగుల కేటాయింపు, బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉంది. ఈ చావులకు ప్రభుత్వమే కాదు… వాళ్లకు వత్తాసు పలికే ఉద్యోగసంఘాలు కూడా బాధ్యులే! 317 జీవో రద్దు కోసం ప్రభుత్వం పై పోరాడుదాం. ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకోవద్దని రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా కోరారు.

Related Articles

Latest Articles