టీఆర్‌ఎస్‌ గుండాలపై చర్యలు తీసుకోవాలి: రేవంత్‌రెడ్డి

టీఆఆర్‌ఎస్‌ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. గంజాయి తెలంగాణగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. గంజాయి మత్తులో టీఆర్ఎస్ గుండాల దాడిలో కాంగ్రెస్ నేత హత్యచేశారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజల మధ్య మద్యం సేవించవద్దు అన్నందుకు టీర్‌ఎస్‌ నేతలు దాడికి పాల్పడ్డారన్నారు. హతుడి సోదరుడితో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించిన రేవంత్‌ రెడ్డి. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Read Also:వడ్లు కొనడం లేదని..యువ రైతు ఆత్మహత్యయత్నం

దోషులను వెంటనే శిక్షించాలన్నారు. ప్రజల మధ్య మత్తు పదార్థాలు సేవించొద్దు అన్నందుకు కాంగ్రెస్ నేతను టీఆర్ఎస్ గుండాల కొట్టి చంపారని, రాష్ట్రంలో పాలన ఎటు పోతుందో అర్థం కావడం లేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజక వర్గం చంపాపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నరసింహారెడ్డి పై కొంతమంది టీఆర్ఎస్ గుండాలు ప్రజల మధ్య గంజాయి తాగొద్దని అన్నందుకు కట్టెలు రాడ్లతో తీవ్రంగా కొట్టి హత్య చేశారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Related Articles

Latest Articles