మోడీ ఆ విగ్రహ ఆవిష్కరణకు రావొద్దు: రేవంత్‌రెడ్డి

చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్, మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు.

Read Also: పాల్వంచ ఘటన..రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు

బీజేపీ నేతలు మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెబుతారని, గుజరాత్‌లో పెట్టిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని చైనాలో ఎందుకు తయారు చేయించారని ఆయన ప్రశ్నించారు. ముచ్చింతలలో పెట్టబోయే రామానుజాచారి విగ్రహం కూడా చైనాలోనే తయారైందని ఆయన తెలిపారు. చైనాలో తయారైన ఆ విగ్రహ ఆవిష్కరణకు మోడీ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు మీరు ఎలా దేశ భక్తులు అవుతారని ఆయన ప్రధాని మోడీ పై ధ్వజమెత్తారు.

Related Articles

Latest Articles