నారాయణపేట జిల్లా కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి

ఓ మర్డర్ ఎటెంప్ట్ కేసులో సాక్ష్యం చెప్పేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు నారాయణపేట జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2009లో కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్‌కు చెందిన అప్పటి కాంగ్రెస్ నేత కృష్ణతో పాటు మరో 12 మంది హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి పిటిషనర్‌గా ఉన్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించి శుక్రవారం రోజు ఆయన జిల్లా కోర్టులో హాజరై సాక్ష్యం చెప్పారు. 2018లోనూ ఇదే కేసులో రేవంత్ కోర్టుకు హాజరయ్యారు.

Read Also: ఆసిఫాబాద్‌ టీఆర్‌ఎస్‌లో అప్పుడే టికెట్‌ లొల్లి..!

కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ తొలిసారిగా నారాయణపేటకు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. కోర్టు కేసు అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులను రేవంత్ కలిసి మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు. పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు.

Related Articles

Latest Articles