భూముల వేలంపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

తెలంగాణ ప్రభుత్వ భూముల వేలంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ జాతి సంపద అమ్మకానికి పెడితే.. స్మశానం కోసం కూడా భూములు ఉండవని… భూముల అమ్మకం చేస్తే పెద్ద కంపెనీలు వస్తాయని…ఉద్యోగాలు వస్తాయని చెప్పారని తెలిపారు. గతంలో భూములు అమ్మినప్పుడు కేటీఆర్, హరీష్ ధర్నాలు చేసి నానా యాగీ చేశారని.. కానీ ఇప్పుడు విధానం మార్చుకున్నారన్నారని ఫైర్‌ అయ్యారు. టెండర్ లో కెసిఆర్ సొంత.. బినామీ సంస్థలు పాల్గొన్నాయని ఆరోపించారు.

read also : రేపటి నుండి తెలంగాణాలో థియేటర్లు తెరచుకుంటున్నాయి!

కోకపేట భూముల్లో 3 వేల కోట్ల ఆదాయం రావాల్సింది… 2 వేల కోట్ల ఎలా వచ్చిందని ప్రశ్నించిన రేవంత్‌… రియల్ ఎస్టేట్ గురించి తనకు తెలుసు అన్నారు. 50 అంతస్థుల బిల్డింగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందని ఫైర్‌ అయ్యారు. భూముల అమ్మకాల్లో అక్రమాలపై, తెలంగాణ పునర్విభజన బిల్లు అమలు కోసం పార్లమెంట్ లో పట్టు పడతామని పేర్కొన్నారు.

కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కూడా గళం విప్పుతమన్నారు. సీఎస్‌ పై 294 కోర్టు ధిక్కార నోటీసులు ఉన్నాయని… ఆయన ఐఏఎస్‌ ఉద్యోగం మానేసి… ప్రైవేట్ కంపెనీలో 8 ఏండ్లు ఉద్యోగం చేశారని తెలిపారు. 8 ఏండ్లు సర్వీస్ తీసేస్తే… ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉద్యోగం కూడా రాదని…కానీ అలాంటి వారిని సీఎస్‌ చేశారని మండిపడ్డారు. కోర్టులో సీఎస్‌ సోమేష్ కేసు ఫైల్ మిస్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-