కేసీఆర్ తెలంగాణ పెద్ద కొడుకు కాదు…?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీకు అవకాశం ఇస్తా అని కాంగ్రెస్ నాయకులకు చెప్పిన ఆయన.. మీ శక్తిని సంపూర్ణంగా వినియోగిస్తామని మాట ఇస్తున్న. కుల వృత్తులు కేసీఆర్ పుట్టక ముందే ఉన్నాయి. రాజ్యంలో వాట అడుగుతున్నాం. మేము రాజులుగా ఉంటాం..మీరు బానిసలుగా ఉండండి అంటున్నారు కేసీఆర్. తెలంగాణ పెద్ద కొడుకు కేసీఆర్ కాదు అని మండిపడ్డారు. నీకు ఇచ్చే నౌకరీ ఇవ్వకుండా… రెండు వేల పెన్షన్ ఇచ్చి ఓటు అడుగుతున్నారు. పెన్షన్ ఇచ్చి ఇంటోల్ల అందరి ఓటు వేయించుకునే వాడు కేసీఆర్ అని తెలిపారు.

దళిత బందు అందరికీ ఇస్తాం అన్నప్పుడు సర్వేలు ఎందుకు అని రేవంత్ ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్టు అని చెప్పుడు ఎందుకు . దళితుల మంచి తనం.. కేసీఆర్ మోసం కి ఉపయోగిస్తున్నారు. హుజురాబాద్ లో 20 వేల మందికి దళిత బందు ఇచ్చి..20 లక్షల మందికి ఎగ్గొట్టలి అని చూస్తున్నారు. దళిత కాంగ్రెస్ నాయకులు అంతా హుజూరాబాద్ బాట పట్టండి. మా బతుకు మీ చేతిలో ఉందని ఇల్లు ఇల్లు తిరగండి. అయ్యప్ప మాల 41 రోజులు వేసుకున్నట్లు మీరంతా 21 రోజుల హుజురాబాద్ మాల వేసుకోండి అని సూచించారు.

-Advertisement-కేసీఆర్ తెలంగాణ పెద్ద కొడుకు కాదు...?

Related Articles

Latest Articles