బీజేపీ తీరుపై ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన రేవంత్‌రెడ్డి

గత రెండు రోజులుగా తెలంగాణలో బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అరెస్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జీవో 317లో సవరణల కోసం బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా మరుసటి రోజు కోర్టులో హజరుపరిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు సికింద్రబాద్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు.

ఈ ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు చెబుతున్నా, ర్యాలీని చేసితీరుతామంటూ బీజేపీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ‘డ్రామా ప్రారంభమైంది.పార్ట్‌ 1. బండి సంజయ్‌ అరెస్ట్‌, పార్ట్‌ 2. జేపీ నడ్డాజీని ఈరోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. తెలంగాణలో బీజేపీని ప్రాథమిక ప్రతిపక్షంగా చూపించడానికే ఇదంతా చేస్తున్నారు.? ఇప్పుడు దీన్ని నేనే పబ్లిక్‌ చేశాను. డ్రామా ఎలా జరుగుతుందో చూద్దాం’ అంటూ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Related Articles

Latest Articles